Trucks

టాటా ట్రక్స్‌: వాణిజ్య వాహనాల ఉత్కృష్టతలో ఘనవారసత్వం

వాణిజ్య వావానాల్లో అద్భుతమైన ప్రతిభ అందించే ఘనవారసత్వం టాటా ట్రక్స్‌లో ఉంది. ఆవిష్కరణలు, వినియోగదారుల సంతృప్తి అనే నిబద్ధత మొదటి నుంచి మా నిర్వహణ కార్యకలాపాల్లో కీలకంగా నిలుస్తోంది. మా కస్టమర్ల విభిన్న అవసరాలు మేము అర్థం చేసుకున్నాం. వివిధ పరిశ్రమలు, అవసరాలకు తగినట్టుగా ఉపయోగపడే వాహనాలు అందించడానికి మేము కృషి చేస్తాం. నాణ్యత, ఆధునిక టెక్నాలజీ కోసం అలుపెరగని కృషి మా ప్రధాన బలాల్లో ఒకటి. వాహన యాజమాన్య ప్రయాణంలో సమగ్ర మద్దతు మా కస్టమర్లకు అందించేందుకు విస్తృతమైన సర్వీసు నెట్‌వర్క్‌ కలిగి ఉండటాన్ని మేము గర్వంగా భావిస్తాం. మేము కేవలం ట్రక్కుల తయారీదారులం మాత్రమే కాదు, మీ వ్యాపార వృద్ధిలో భాగస్వాములం కూడా. సుస్థిరత దిశగా ఉండే నిబద్ధత మా వాహనాల్లో పర్యావరణ అనుకూల పరిష్కారాల అభివృద్ధి, ఉద్గరాల తగ్గింపు, ఇంధన సామర్ధ్యం పెంచేలా మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

 

4,00,000

కనెక్టెడ్‌ ట్రక్కులు

 

18,000+

స్పేర్‌ పార్ట్‌ రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌

 

160+

టాటా జెన్యూస్‌ పార్ట్స్‌ (TGP) డిస్ట్రిబ్యూటర్‌ పాయింట్స్

 

1,500

సర్వీసు వర్క్‌షాపులు

మా బ్రాండులు

Image
Tata Motors Prima
మీ గ్యారేజీకి గర్వకారణం 
Image
Tata Signa
సామర్ధ్యానికి సౌందర్యం
Image
Tata Ultra Range
మెరుగైన విలువ
Image
సమర్థత, ఉత్పాదకత, లాభదాయకత

ప్రపంచస్థాయి ట్రక్కుల శ్రేణి ఆవిర్భావం

Image

Evolution of the world class trucks range

1975

1975

టాటా 1210 సెమీ ఫార్వార్డ్‌ మోడల్‌ను చూసిన భారతీయరహదారులు

Image

Evolution of the world class trucks range

1969

1969

టాటా బ్రాండ్‌గా మారిన టెల్కో

Image

Evolution of the world class trucks range

1954

1954

TMB 312 ట్రక్‌ – మొదటి వాణిజ్య వాహన ఆవిష్కరణ

Image

Evolution of the world class trucks range

1948

1948

మార్షల్ సన్స్ (యుకే) సహకారంతో స్టీమ్‌ రోడ్‌ రోలర్‌ ఆవిష్కరణ

Image

Evolution of the world class trucks range

1945

1945

లోకోమోటివ్స్‌, ఇతర ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల తయారీ

ప్రశంసలు

అత్యుత్తమ ఫలితాలు, భాగస్వాములకు గణనీయమైన విలువ అందించడంలో టాటా మోటార్స్ స్థిరమైన గుర్తింపు పొందింది. మేము అందుకునే ప్రశంసలు మా పనితీరు మరింతగా విస్తరించుకునేలా మమ్మల్ని ప్రేరేపిస్తాయి.

Image

CII

అల్ట్రా T.7: డిజైన్‌ ఎక్సలెన్స్అవార్డుల విజేత

2018

Image

ఫ్లైవీల్‌

అల్ట్రా 1412: సంవత్సరపు వాణిజ్య వాహనం

2019

Image

ఫ్లైవీల్

అల్ట్రారేంజ్: సంవత్సరపు మీడియం డ్యూటీట్రక్‌

2019

టెక్నాలజీ

పనితీరు, భద్రత, సామర్ధ్యం, డ్రైవర్‌ సౌకర్యాలు పెంచే ఎన్నో ఆధునాతన సాంకేతిక ఫీచర్లను టాటా ట్రక్స్‌ కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఫీచర్లు మోడల్స్‌, రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వాటి సాధారణ ఉదాహరణలు ఇవి:

టాటా మోటార్స్ ట్రక్కులలో టెలిమాటిక్స్ టెక్నాలజీ అనుసంధానమై ఉండటంతో వాహన పనితీరు పరిశీలించడానికి, స్థానాన్ని ట్రాక్ చేయడానికి, ఇంధన సామర్థ్యాన్ని విశ్లేషించడానికి, లాజిస్టిక్స్‌ను దూరం నుంచి నిర్వహించడానికి వాహన యజమానులు, మేనేజర్లకు వెసులుబాటు లభిస్తుంది. టెలిమాటిక్స్ సిస్టమ్స్ వాహన కార్యకలాపాలు ఆప్టిమైజ్ చేయడానికి రియల్‌టైమ్‌-డేటా తెలుసుకునేందుకు సాయపడతాయి.

Image

ఇంధన సామర్థ్యాన్ని పెంచే అధునాతన ఇంజిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌, ఆప్టిమైజ్డ్ ఏరోడైనమిక్స్, ఇంటెలిజెంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టాటా ట్రక్కులు కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్లు మైలేజీని మెరుగుపరిచి నిర్వహణ ఖర్చులు, ఉద్గారాలు క్షీణింపజేసి పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తాయి.

Image

భద్రతకు ప్రాధాన్యమిచ్చే టాటా ట్రక్స్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ సాంకేతికతలు వాహన స్థిరత్వాన్నిపెంచి బ్రేకింగ్ పనితీరు మెరుగుపరుస్తాయి. కఠినమైన భూభాగాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో డ్రైవర్లకు సాయపడతాయి.

Image

డ్రైవర్‌ వాహనాన్ని యుక్తిగా తిప్పేందుకు, సురక్షితంగా పార్క్ చేసేందుకు వీలుగా కొన్ని టాటా ట్రక్ మోడల్స్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్‌వ్యూ కెమెరాలు, ప్రాక్సిమిటీ సెన్సార్ల వంటి డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ సాంకేతికతలు ప్రమాదాల ముప్పు తగ్గించడంలో సాయపడుతూ మొత్తంగా నిర్వహణ సామర్ధ్యాన్ని పెంచుతాయి.

Image

డ్రైవరుకు చక్కని విశ్రాంతి అందించే సౌకర్యవంతమైన కేబిన్‌పై టాటా ట్రక్స్‌ దృష్టి సారిస్తుంది. అడ్జస్టబుల్‌ సీట్లు, ఎయిర్‌ కండిషనింగ్‌, పవర్‌ స్టీరింగ్‌, మల్టీమీడియా సిస్టమ్స్‌ వంటి ఫీచర్లు డ్రైవరుకు సౌకర్యాలు పెంచి దూరప్రాంత ప్రయాణాల్లోఅలసట తగ్గిస్తాయి.

Image

స్మార్ట్‌ఫోన్లు, ఇతర పరికరాలతో నిరంతరాయ కనెక్టివిటీ అందించే వెసులుబాటు టాటా మోటర్స్‌ అందిస్తుంది. నేవిగేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్ పనులకు యాక్సెస్‌ అందించే ఈ ఫీచర్ల ద్వారా కనెక్టివిటీ మెరుగుపడి డ్రైవర్లకు సౌకర్యం పెరుగుతుంది.

Image

వాహన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు, మెయింటెనెన్స్, తలెత్తబోయే సమస్యలకు సంబంధించి అలర్ట్స్‌ పంపించేందుకు కొన్ని టాటా ట్రక్‌ మోడల్స్‌లో ఆన్‌బోర్డ్‌ డయాగ్నాస్టిక్స్‌ సిస్టమ్స్‌ ఉన్నాయి. దూరం నుంచి కూడా వాహనాన్ని మానిటర్‌ చేసే వెసులుబాటు ఉండటం వల్ల వాహన సమాచారాన్ని ఫ్లీట్ మేనేజర్స్‌ ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. తద్వారా మెయింటెనెన్స్ ప్లానింగ్‌ చేసుకొని డౌన్‌ టైమ్‌ తగ్గించుకోగలుగుతారు.

Image

సుస్థిరత

పచ్చని భవిష్యత్‌ కోసం సుస్థిర పరిష్కారాల ప్రయాణం.

Image
ముందుకు వెళ్లేందుకు ఒక సుస్థిరమైనదారి

ప్రత్యామ్నాయ ఇంధన టెక్నాలజీ శక్తితో కూడిన సృజనాత్మక రవాణా పరిష్కారాలను టాటామోటర్స్‌ అభివృద్ధి చేస్తోంది, తయారూ చేస్తోంది. ఇందులో CNG ట్రక్కులు, LNG ట్రక్కులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, హైడ్రోకూడాఉన్నాయి. సమర్థవంతమైన ఇంధన సౌకర్యాలు, వ్యర్థాలు తగ్గించే వ్యూహాలు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వినియోగం సహా సరికొత్త స్థిరమైన తయారీ పద్ధతులను మేము నిరంతరం అందిపుచ్చుకుంటున్నాం.

Image
సున్నా- కర్బన ఉద్గారాల దిశగా ప్రయాణం

సమర్థవంతమైన నిర్మాణం ఉండేలా అధిక శక్తి కలిగిన తేలికపాటి మెటీరియల్స్‌తో తేలికపాటి బరువు డిజైన్‌ సూత్రాలలో మేము అగ్రగాములం. ఈ విధానం ద్వారా ఇంధన సామర్ధ్యం పెరగడమే కాదు, నిర్వహణకు ఇంధన అవసరం తగ్గి కార్బన్‌ ఫుట్‌ ప్రింట్‌ తగ్గించడంలో మాకు సాయపడుతుంది.

Image
బాధ్యతాయుతంగా విడదీయడం, రీసైక్లింగ్‌

వ్యర్థాలు తగ్గించడం, వనరుల గరిష్ఠ రికవరీ పైదృష్టి సారించే మేము పర్యావరణపరంగా స్థిరమైన పద్ధతిలో జీవితకాలం ముగిసిన వాహనాలను విడదీయడం, రీసైకిల్‌ కోసం మేము అనేక చర్యలుఅమలు చేస్తాం.

Image
సుస్థిర లాజిస్టిక్స్ విప్లవం

వివిధ రంగాలకు సంబంధించి మొత్తం సరఫరా వ్యవస్థలో వాహన రాకపోకలకు ఎండ్‌-టు-ఎండ్‌ ప్రాధాన్యం, ఉద్గారాల తగ్గింపు, పర్యావరణహిత విధానాలు ఆచరించేలా మా పద్దతులు ఉంటాయి.

Image
వాతావరణపరంగా జాగృత దృష్టికోణం

కర్బన ఉద్గారాలు తగ్గించి మెరుగైన రేపటి కోసం నెట్‌ జీరోలక్ష్యం వైపు వెళ్లడమన్నది మా ఆవిష్కరణ, సాంకేతికతలో ప్రధాన అంశం. మా స్థిరమైన విధానాలతో 2024 నాటికి మా కంపెనీలు కార్బన్ న్యూట్రాలిటీ సాధించేలా మేము కట్టుబడి ఉన్నాము.